అంబ.. అంబటి అంటూ అంబటి రాంబాబుకు ఘాటు రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20:

రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆవేశంతో కదిలిపోయే పవన్ కల్యాణ్ ను చూసేవారు. ఆ తర్వాత మాటల్లో అస్పష్టత ఉన్న ఆయన.. గడిచిన కొద్దికాలంగా మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తొందరపాటు తగ్గటం.. అనవసరమైన ఊగిపోవటాలు పోయి.. విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పేయటం.. తనను మాటలతో  టార్గెట్ చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులు మళ్లీ మాట్లాడకుండా నోరు మూపించేలా మాట్లాడుతున్నారు జనసేనాని. మార్పు కొట్టొచ్చినట్లుగా మారిపోతున్న పవన్ మాటలు తీరు.. ఒకప్పుడు ఆయన్ను వేలెత్తి చూపినోళ్లు.. వెటకారం ఆడినోళ్లు కూడా చాలానే మారారంటూ ఆయన మాటల ఆకర్షణలో పడుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తనను టార్గెట్ చేసే వారి గాలి తీసేయటమే కాదు.. వారి ముఖంలో నెత్తురు చుక్క లేకుండా మాటలతో కిక్ బాక్సింగ్ ఇస్తున్న పవన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సత్తెనపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఒక ఆట ఆడేసుకున్నారు. మళ్లీ నోరు విప్పే సాహసం చేసే అవకాశం ఇవ్వని రీతిలో మాటల ముష్ఠిఘాతాల్ని ఇచ్చేశారని చెప్పాలి.  ‘అంబటి.. అంబ.. అంబటి అనే లోపు రాంబోలా మాట్లాడతారు’ అంటూ మొదలు పెట్టిన పవన్.. ఆయన్ను ఎవరూ ఇంత నేరుగా.. సూటిగా అనలేని మాటల్ని అనేశారు.

తనను ఉద్దేశించి నోటికి వచ్చినట్లు మాట్లాడే అంబటి.. 2019 ఎన్నికల వేళలో తమ పార్టీ గుర్తు కారణంగా తనకు జరిగే కష్టం గురించి నెత్తినోరు కొట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. వ్యాఖ్యానించటం ద్వారా.. తాను ఎవరినైనా టార్గెట్ చేసే ముందు అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే పంచ్ లు విసురుతానన్న విషయాన్నిచెప్పకనే చెప్పేశారు.  ఒక విధంగా చెప్పాలంటే.. పవన్ ను కెలికి పెద్ద తప్పే చేశాను సుమి అన్నట్లుగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయి.మంత్రి అంబటిపై పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. ”అంబ.. అంబటి అనే లోపు రాంబోలా  మాట్లాడతారు. రాజుపాలెంలో అంబటి గారు మాట్లాడుతా జనసేన గాజు గ్లాసు కాదు నా గుండెల్లో దింపే గునపం అన్నారు. ఇప్పుడు చెబుతున్నా.. అంబటి.. కాపుల గుండెల్లో కుంపటి. పోలవరం ఫినిష్ చేయండి అంటే.. ఎప్పుడు అవుతుందో తెలీదు అంటారు. మీరేమో ఇరిగేషన్ శాఖా మంత్రి. కానీ ఇరిగేషన్ గురించి తెలియదు. ఏపీ గురించి మాట్లాడితే.. మీరేమో రానివ్వం.. కేసులు పెడతాం.. అంటారు. పిచ్చి కతలు ఆపేసేయండి. వ్యక్తిగతంగా అంబటి మీద.. నన్ను తిట్టే వైసీపీ నాయకుల మీద కోపం ఉండదు. కానీ.. ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతారు. వాటికి మేం భయపడే ప్రసక్తే లేదు” అని వ్యాఖ్యానించారు.

అంబటి అవినీతి సంపాదన గురించి కూడా పవన్ నేరుగా పంచులేశారు. అంబటి పరువును నిలువునా తీసేశారు. తనను వారంలో ఒకసారి ఏపీకి వస్తారంటారు. నేను వారానికి ఒకసారి వస్తేనే ఇలా ఉంది. రోజు వస్తే మీకు ఇంకేమవుతుందో? అన్నారు. ”నాకు మీ లాగా వేరే ఆదాయాలు లేవు. అంబటిలాగా పేద రైతులకు అందాల్సిన ఏడు లక్షలకు రూ.2లక్షలు లంచం తీసుకునే దరిద్రపుగొట్టు మనస్తత్వం నాకు లేదు. నా సొంత డబ్బు కోట్లు నేనే ఇస్తాను తప్ప.. ప్రజల కన్నీళ్లు.. శవం మీద పేలాలు ఏరుకునే మనస్తత్వం అంబటి గారికి ఉంది కానీ నాకు లేదు.

అలాగే ఎప్పుడు నేను మాట్లాడినా కానీ వైసీపీ గాడిదలు వచ్చేస్తాయి. నన్ను తిట్టే వైసీపీ గాడిదలు బాధ పడొచ్చు కానీ మీరు సంస్కారవంతంగా మాట్లాడితే.. నాకంటే సంస్కారవంతుడు కనిపించడు’ అంటూ తన గురించి చెప్పటమే కాదు.. అంబటిని మాటలతో బట్టలు విప్పేసిన పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఎపిసోడ్ లో అయినా అంబటి మౌనంగా ఉంటారా? మళ్లీ నోరు విప్పి పవన్ చేత మళ్లీ మాటలు అనిపించుకుంటారో చూడాలి.

Related Posts

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

Spread the love

Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!