ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్ష్యాల్ని పరిగణలోకి..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం..!

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16:

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్  చూసి తదుపరి విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన సీడీలు పెన్ డ్రైవ్ లను ముఖ్యమంత్రి కోర్టుకు పంపారు. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

మొయినాబాద్ ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆధారాలైన వీడియోలను సీఎం కేసీఆర్ దేశంలోని ప్రధాన మీడియా సంస్థలతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరికీ పంపించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పంపిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు చెప్పడం సంచలనమైంది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ జగ్గుస్వామి సిట్ నోటీసులపై స్టేను హైకోర్టు మరికొంతకాలం పొడిగించింది. 22 వరకూ స్టే పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో లా అండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా ఏసీబీతో ఎందుకు విచారణ జరిపించలేదని పిటీషనర్లు వాదించారు. బీజేపీ తెలంగాణ విభాగం తరుఫున సీనియర్ న్యాయవాది జే. ప్రభాకర్ తన వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరిపే అధికారం సిట్ కు కానీ.. మొయినాబాద్ పోలీసులకు కానీ.. ఏసీపీకి కానీ లేదన్నారు. సిట్ ను నియమించే జీవోలో కూడా అవినీతి నిరోధక చట్టం ప్రస్తావన లేదని.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద నియమించారని చెప్పారు.

 హైకోర్టు ధర్మాసనం నిందితులు ఫరీదాబాద్కు చెందిన రామచంద్ర భారతి హైదరాబాద్కు చెందిన నంద కుమార్ తిరుపతికి చెందిన సింహయాజి స్వామి ఒక్కొక్కరికి రూ.3 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరి పూచీకత్తులను సమర్పించాలని కోరింది. నిందితులు తమ పాస్పోర్ట్లను కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించాలని హైదరాబాద్ వదిలి వెళ్లవద్దని న్యాయమూర్తి కోరారు.రిజిస్టర్పై సంతకం చేసేందుకు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరు కావాలని ఆమె కోరారు. అయితే ముగ్గురూ వెంటనే జైలు నుంచి బయటకు రాలేకపోయారు. ఎందుకంటే వారు రూ. 3 లక్షల వ్యక్తిగత బాండ్లు మరియు అదే మొత్తానికి మరో ఇద్దరు పూచీకత్తులు సమర్పించడానికి మార్గం లేకుండా పోయింది.తాజాగా విడుదలైన వెంటనే మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం చర్చనీయాంశమైంది.

Related Posts

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

Spread the love

Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

Spread the love

Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు