జనసముద్రం న్యూస్ ,బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి ,డిసెంబర్15,
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదిన వేడుకల సందర్భంగా తాండూరు మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సేవా జ్యోతి శరణాలయంలో కేక్ కట్ చేసి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాండూరు బిజెపి మండల అధ్యక్షులు రామగౌని మహీధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల కోసం జిల్లా వ్యాప్తంగా సేవ కార్యక్రమాలు చేస్తూ కరోనా కష్టకాలంలో మరియు వరదల సమయంలో అధికారం లేకున్నా ప్రజల కోసం పని చేస్తున్న రఘునాథ్ భవిష్యత్తులో మంచిర్యాల్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజాసంఘ్రమ యాత్ర ముగింపు బహిరంగ సభకు కరీంనగర్ కి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నవ్నూరి సుధీర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పట్టెం విష్ణు కళ్యాణ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఏముర్ల ప్రదీప్, బీజేవైఎం మండల అధ్యక్షులు చజ్నాల రాహుల్, మండల ఉపాధ్యక్షులు విగ్నేష్, ఆడవాల సతీష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.