జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 :
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల జరుగుతున్న మోసాలకు అంతులేకుండా పోతున్నాయి. ముడుపుల ముడితే చాలు ఎలాంటి దళారి పనులకైన, వెనుకాడని రెవెన్యూ అధికారులతో అసలు పట్టాదారులు నష్టపోతున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ బస్వాపూర్ లో గడిచిన 30 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన తాడెం.కనకయ్య తండ్రి చంద్రయ్య తనకున్న వ్యవసాయ భూమి రెండు ఎకరాల, ఇరువై ఆరు గుంటలను (2.26) అమ్ముకొని, మరొక ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్మెట కు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. తాను అమ్మిన భూములన్నీ అప్పుడున్న భూ పోర్టల్ సర్వే ప్రకారం అతని పెరు పై నమోదై ఉన్నాయి. అయితే ఆ భూమిని కొనుగోలు చేసిన సదరు వ్యక్తుల వద్ద సరైన విక్రయ పత్రాలు (సర్వే నంబర్లు) లేకపోవడంతో, ఇప్పుడొచ్చిన ధరణిలో కొనుగోలు చేసిన వ్యక్తులకు భూమి పట్టా కాలేదు. ప్రస్తుత ధరణి పోర్టల్ “996/13, 1130/9/1, 1130/9/2, 1330/ఆ/f, 1351అ/2, 1357/1/7, 1391/2″ సర్వే నంబర్లలో ఉన్న (2.19) భూమిని గ్రామానికి చెందిన దళారులు గుర్తించి, భూమి అమ్మిన వ్యక్తితో మంతనాలు జరిపి, రెవెన్యూ అధికారుల అండదండాలతో గుట్టు చప్పుడు కాకుండా దళారులు వారి పక్షాన సోమవారం భూములను పట్టా చేయించుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రస్తుత పట్టాదారులు ఆ భూమిని వేరొకరి పేరు మీద పట్టా చేయొద్దని, గత కొద్ది సంవత్సరాలుగా మేమే కాస్తులో ఉంటున్నామని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి లాభం లేకుండా పోయింది. సదరు భూమిని యదేచ్ఛగా రెవెన్యూ అధికారులు వేరొకరికి పట్టా చేసి, సెలవు తీసుకోవడం కోస మెరుపు, దీంతో అసలు పట్టాదారులు లబోదిబోమంటున్నారు. తమ భూములు దురాక్రమనకు గురవుతున్నాయని, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై అంశంపై కోహెడ రెవెన్యూ అధికారులను “జనసముద్రం న్యూస్ వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు వెలువడుతున్నాయి. ఇక దీనిపై పై అధికారులు ఎలా స్పందిస్తారో… వేచి చూడాలి.