మంత్రులు కేవలం కుర్చీల కే పరిమితం..సీఎంలు చెబితేనే పనులు..తెలుగు రాష్ట్రాల్లో మంత్రులను కూడా లెక్కచేయని అధికారులు..!!

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 :

మంత్రి అంటే.. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా.. పవర్ ఫుల్. మంత్రిగారు చెప్పారంటే.. ఉన్నతాధికారి నుంచి కిందిస్థాయి అధికారి వరకు ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ పనిచేయాలి. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా మంత్రి పేషీకి అందించాలి. ఇది ఎక్కడైనా రివాజు. మంత్రిగారి అధికారం అలాంటిది మరి! కానీ ఇది ఎక్కడైనా చెల్లుతుందేమో.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవేమీ పనికావడం లేదని అంటున్నారు పరిశీలకులు. కొందరు మాత్రమే ప్రత్యేకం అన్నట్టుగా.. తెలంగాణ సీఎం కేసీఆర్  తర్వాత ఆయన కుమారుడు కేటీఆర్ను మాత్రమే అధికారులు మంత్రిగా చూస్తున్నారు.

ఇదినిష్టుర సత్యం. మంత్రుల మధ్య జరుగుతున్న సంభాషణలే దీనిని రుజువు చేస్తున్నాయి. ఇటీవల ఓ కీలక మంత్రి.. ఆయన బీసీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు గతంలో టీడీపీలో కూడా పనిచేసి.. మంత్రిగా చక్రం తిప్పారు. అయితే.. తెలంగాణలో మంత్రి అయినా.. ఆయన మాటను అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీంతో తన సొంత పనికి సంబంధించి కూడా కేటీఆర్తో ఫోన్ చేయించుకోవాల్సిన వచ్చిందని సహచర మంత్రి ముందు వాపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఇటీవల వెలుగు చూసిన ఐటీ దాడులతో రికార్డు స్థాయిలో ట్రోల్స్కు గురైన మరో మంత్రి మల్లారెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉందనే టాక్ వినిపిస్తోంది.  ఆయనను కూడా ఉన్నతాధికారులు ఎవరూ లెక్కచేయడంలేదని.. అంటున్నారు.

ఇక హోం మంత్రి గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిది. కనీసం ఆయన కానిస్టేబుల్ను కూడా కదిలించలేని పరిస్థితి ఉందని సొంత పార్టీలో చర్చ సాగుతోంది. అంటే.. కేవలం మంత్రులు ఉన్నారు.. వారి అధికారాలు మాత్రం మాంత్రికుడి ప్రాణంగా మారిపోయిందనే టాక్ వస్తోంది.ఏపీ విషయానికివచ్చినా.. ఇదే పరిస్థితి. ఏం చేయాలన్నా.. ఏం చెప్పాలన్నా.. అన్నీ సీఎం జగన్ తర్వాత సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి అనే టాక్ జోరుగా వినిపిస్తోంది. రాష్ట్రంలో రోడ్లు బాగోలేవు.. అని కథనాలువచ్చినా.. ఆర్టీసీ బస్సులు ఎక్కడబడితే అక్కడ చతికిల పడుతున్నాయనే విమర్శలు వచ్చినా.. సదరు మంత్రి తాపీగా .. సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అనే చెబుతున్నారు. ఇక కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అయితే.. నియోజకవర్గానికి ఎక్కువ.. అనే స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారు.

ఏపీలో హోం శాఖను ఎస్సీ మహిళా నేతకు ఇచ్చినా.. ఆమెదీ తెలంగాణ లో మహమూద్ అలీ లాంటి పరిస్తితే నని వైసీపీ నాయకులే చెవులుకొరుక్కుంటున్నారు. కనీసం సమీక్షలు చేసే అధికారం కూడా ఈమెకు లేదనే టాక్ వినిపిస్తోంది. కానీ అటు తెలంగాణలోనూ.. ఇటు ఏపీలో సీఎంలు చెబుతున్నది ఏంటంటే.. మేం అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామనే. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మాంత్రికుడి కథే వినిపిస్తోంది.. కనిపిస్తోంది.

Related Posts

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

Spread the love

Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

Spread the love

Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు