భారత్ కు రష్యా బంపర్ ఆఫర్..తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు..!

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 12:

భారత్ లో పెట్రోల్.. డీజీల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా నిత్యావసర ధరలు సైతం హద్దు అదుపు లేకుండా పోతున్నాయి. కరోనా కాలంలో చమురుకు డిమాండ్ పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్.. డీజిల్ ధరలు నేలచూపులు చూశాయి. అయితే ఆ సమయంలో భారత్ లో చమురు ధరలు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.

ఇక కరోనా పరిస్థితి నుంచి ప్రపంచం కోలుకున్నాక చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ సమయంలో మాత్రం భారత్ తో మునుపటి కంటే రెండింతలు పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు.. సామాన్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికలు జరిగే సమయంలో పెట్రోల్.. గ్యాస్.. డీజిల్ ధరలను ఒకింత తగ్గిస్తూ ఎన్నికలు పూర్తవ్వగానే అమాంతం మళ్లీ పెంచేస్తుండటం ఇటీవలి కాలంలో తరుచూ జరుగుతోంది. అయితే చమురు ధరల విషయంలో రష్యాకు భారత్ అండగా నిలుస్తుండటంతో ఆ దేశం తక్కువ ధరకే మనకు చమురు లభ్యమవుతోంది.ఈ నేపథ్యంలో భారత్ పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ ధరలకు కళ్లెం పడే అవకాశం కన్పిస్తోంది. ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో రష్యా చమురు ఎగుమతులపై జీ7 దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అయితే ఈ ఆంక్షలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ చర్యలపై మాస్కో సంతోషం వ్యక్తంగా భారత్ కు భారీ డిస్కౌంట్ తో క్రూడ్ ఆయిల్ ను సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అంతేకాకుండా భవిష్యత్ లోనూ తక్కువ ధరలో చమురు కొనుగోళ్లను కొనసాగించేలా భారీ సామర్థ్యం ఉన్న ఓడల నిర్మాణం.. లీజు వ్యవహారంపై భారత్ కు సహకరించనున్నట్లు రష్యా తాజాగా ప్రకటించింది. ఆ మేరకు మాస్కోలోని భారత రాయబారి పవన్ కపూర్ తో రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ సమావేశమై ఈ విషయాన్ని ప్రకటించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈనెల 5న జీ7 దేశాలు సమావేశమై రష్యా చమురుకు గరిష్టంగా 60 డాలర్లు చెల్లించాలని నిర్ణయించాయి. పరిమితికి మించి ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన రష్యా చమురుపై బీమా సేవలు.. షిప్పింగ్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ నిర్ణయాన్ని భారత్ పూర్తిగా వ్యతిరేకించింది. ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ చమురు ఎగుమతులు.. ఇంధన వనరుల సరఫరాలో రష్యా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తుందని పేర్కొంది.

కాగా మరోవైపు ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో చమురు ధరలు కొండెక్కుతున్నాయి. మరోవైపు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచేందుకు సానుకూలంగా లేకపోవడంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడే అవకాశం కన్పిస్తోంది. అయితే భారత్ కు మాత్రం రష్యా భారీ డిస్కౌంట్ ఇస్తుండటంతో పెద్దమొత్తంలో క్రూడ్ ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటోంది.

వరుసగా రెండో నెలలోనూ భారత్ కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యా నిలిచింది. నవంబర్లో రోజుకు 9లక్షల 9వేల 403 పీపాల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం.

  • Related Posts

    గ్యాంగ్ రేప్.. హత్య.. దేశానికీ సిగ్గు చేటు :అల్లెం కోటి.

    Spread the love

    Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21. మణిపూర్ లో మెజారిటీ వర్గమైనమైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు…

    యూనిఫాం సివిల్ కోడ్ యూసీసీ అమలు దిశగా కేంద్రం మరో ముందడుగు..ఇక పై ముస్లింలు ,హిందువులు,ఇతరులు అందరికీ ఒకటే చట్టం..!

    Spread the love

    Spread the loveజనసముద్రం న్యూస్,జూలై 7: ఒక దేశం.. ఒక చట్టం దిశగా మోడీ సర్కారు అడుగులు వేయటం తెలిసిందే. ఒకే దేశంలోని ప్రజలకు మతాల వారీగా చట్టాలు ఉండటం ఏమిటి? అందరికి ఒకే చట్టం ఎందుకు ఉండకూడదన్న వాదనకు తగ్గట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు