
జనసముద్రం, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎంగాలి సాయి విగ్నేష్, డిసెంబర్ 6:
ఈరోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు ప్రతి పేదింటి ఆడబిడ్డ కళల్లో ఆనందం నింపుతుందని మరియు పేదింటి ఆడపిల్లకు అండగా ఉందని ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి కోవా లక్ష్మి మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరు అయినా అవి 65 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ జడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్ మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ మరియు మండల ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.





