జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 :
చెల్లీ జాగ్రత్త. మా ఆయన అనుకుంటే అరగంటలో రౌడీలను పంపించి మీ ఆయన్ను చంపేస్తాం అంటూ అధికారపార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే భార్య తన సొంత చెల్లెలను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం సృష్టిస్తున్నాయి. శ్రీకాహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబంలో ఏర్పడ్డ విబేధాలు బజారుకెక్కాయి. తన సొంత బావపైన ఆయన బామ్మర్ది మరదలు తీవ్రస్థాయిలో చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యేనే కాకుండా ఆయన భార్య కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని స్వయంగా ఎమ్మెల్యే భార్య సొంత చెల్లెలే ఫిర్యాదు చేయడంతో శ్రీకాళహస్తి రాజకీయాలు రచ్చరంబోలాగా మారాయి.
ఎక్కడైనా బావేగానీ పవర్ కాడ మాత్రం కాదంటున్నారట శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి. రాజకీయాల్లో బంధుత్వాలకు బాంధవ్యాలకు తావుండవు. శ్రీకాళహస్తిలో అధికారపార్టీ ఎమ్మెల్యే ఆయన బామ్మర్ది మధ్య వీధికెక్కిన విబేధాలు ఇప్పడు దాన్ని మరోమారు రుజువు చేస్తున్నాయి. తన బావ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధనరెడ్డి పెట్టే బాధలు భరించలేకపోతున్నాను శ్రీకాళహస్తీశ్వర స్వామి సాక్షిగా నా భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని సచ్చిపోతానని వైసీపీ ఎమ్మెల్యే బామ్మర్ది సామాను శ్రీధర్ రెడ్డి చేస్తున్న రచ్చతో వారి కుటుంబంలోని గొడవలు వీధికెక్కాయి. శ్రీధర్రెడ్డి ఏకంగా పోలీసు స్టేషన్కు వచ్చి తనన్ను కాల్చి చంపేయండని ఆవేదన వ్యక్తం చేసిన వీడియోలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.వైసీపీ ఎమ్మెల్యేల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్టైలే వేరు. తిరుపతి ప్రాంతానికే ప్రత్యేకమైన మాండలికంలో ఆయన మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు ఆయన ఇంట్లో విబేధాలు బజారున పడటంతో ఈ ఎమ్మెల్యే మరోమారు వివాదాలకు కేంద్రబిందువై వార్తల్లోకి ఎక్కారు.
శ్రీకాళహస్తి మండలం ఏ.ఎం. పుత్తూరు సీమంలోని తన ఫామ్ హౌస్లో శుక్రవారం అర్థరాత్రి తన చేతిపైన కోసుకుని పొట్ట నడుము చుట్టూ కూడా కత్తిగాయాలతో రక్తం ఓడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేయడం రాస్ట్రంలో సంచలనం సృష్టించింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆయన్ను అననయించే ప్రయత్నం చేయగా ఆయన తన బావపైన తీవ్ర ఆరోపణలు చేశారు.మా బావ నా అనుచరులపైన అక్రమ కేసులు పెట్టారు నా ఇంటి వద్ద నిఘా పెట్టారు నన్ను మానసికంగా హింసిస్తున్నారు. ఆయన కారణంగా అప్పులపాలయ్యాను. ఆయన మా ఇంటికొస్తే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం అన్నారు. అంతటితో ఆగకుండా పోలీసులను చూసి మమ్మల్ని కాల్చేయండి మీకు ప్రమోషన్లు ఇచ్చి మిమ్మల్ని డీఎస్పీలను చేస్తారు అన్నారు. మీకు కూడా అంతకంటే ఏం కావాలి అని ఆగ్రహం చెందారు.
అంతటితో ఆగకుండా ఆయన తన మెడమీద కత్తిపెట్టకుని చచ్చిపోతానని బెదిరిస్తూ పోలీసుల ముందు ఎమ్మెల్యేపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు.
వాళ్లకు (ఎమ్మెల్యే మధుసూధన్రెడ్డి) కూటికి గుడ్డకు లేకుండా అప్పులపాలైతే నేను సాయం చేశాను. వాళ్లకోసం 30 ఎకరాల పొలం అమ్మాను. నేను అప్పులు కట్టకపోతే వాళ్లు శ్రీకాళహస్తిలో అడుగు కూడా పెట్టేవారు కాదు. రూ.2 కోట్లు కావాలని ఏడిస్తే ఇచ్చాను. తీరా ఎమ్మెల్యేగా గిలిచాక నన్ను నమ్మకపోగా పార్టీ నుంచీ బయటకు వచ్చేశాను. నేను ఏ పార్టీలో చేరలేదు. నాకు ఆస్తి లేకున్నా పరవాలేదు. ఆయన్ను ఆయన బిడ్డలను గుడికి వచ్చి ఆ ఆస్తి తమదేనని ప్రమాణం చేయమనండి చాలు నేను అన్నీ వదిలేసి వెళ్లిపోతాను అన్నారు.తన భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడం చూసి ఆయన భార్య పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. తన సోదరి ఎమ్మెల్యే భార్య శ్రీవాణి మమ్మల్ని బెదిరిస్తోందని ఆమె ఆరోపించారు. మా ఆయన అనుకుంటే అరగంటలో రౌడీలను పంపించి చంపిస్తాం అని బెదిరిస్తోందని తమను తమ భర్తను కాపాడాలని ఆమె వేడుకుంటున్నారు.