టీనేజర్ల పై పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్..16 సంవత్సరాలకే జ్ఞాపక శక్తి కోల్పోయి 70 ఏళ్ల వృద్దుల్లా ప్రవర్తిస్తున్న యువకులు

Spread the love

అనంతపురం,డిసెంబర్3:

చైనాకు చెందిన కరోనా వైరస్ ప్రపంచాన్ని నాలుగేళ్లుగా అతలాకుతలం చేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కాగా.. లక్షలాది మంది అమాయకులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. సైంటిస్టుల విశేష కృషి ఫలితంగా కరోనా వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కరోనాకు ముందు పరిస్థితులు మళ్లీ కన్పిస్తున్నాయి.


ఒక్క చైనా మినహా ప్రస్తుతం అన్ని దేశాల్లోనూ కరోనా కంట్రోల్లోనే ఉంది. అయితే కరోనా బారిన పడి కోలుకున్న వారిలో చాలామంది పోస్ట్ కోవిడ్ వ్యాధులతో బాధపడుతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరిలో శ్వాస కోస.. కిడ్ని.. మధుమేహం.. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు పోస్ట్ కోవిడ్ కు గురవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే ఇప్పటిదాకా ముందుగానే రోగాల బారిన పడి వారి ఈ జాబితాలో ఉండగా ఇప్పుడు టీనేజర్లు సైతం పోస్ట్ కోవిడ్ బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన స్టాన్ ఫర్డ్ విద్యాలయం విద్యార్థుల పరిశోధనలో తాజాగా వెల్లడైంది. బయోలాజికల్ సైకియాట్రీ.. గ్లోబల్ ఓపెన్ సైన్స్ అనే పత్రికలో ఇందుకు సంబంధించిన కథనాలు ప్రచురితమయ్యాయి.

కోవిడ్ ఎఫెక్ట్ తో 16 ఏళ్ల కుర్రాడు 70 ఏళ్ల వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడని వారి పరిశోధనల్లో తేలడటంతో అంతా షాకవుతున్నారు. కోవిడ్ మహమ్మరి యువత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని గతంలోనే నిపుణులు హెచ్చరించారు. అయితే తాజా అధ్యయనంలో యువత మెదడు పనితీరుపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతందని స్టాన్ ఫర్డ్ న్యూరో డెవలప్ మెంట్.. ఎపెక్ట్ అండ్ సైకోపాథాలజీ ల్యాబ్ డైరెక్టర్ ఇయాన్ గోట్లిబ్ తెలిపారు.మనిషి వయస్సు పెరిగే కొద్ది మెదడు నిర్మాణం సహజంగా మారుతుందని.. టీనేజ్ లో మెదడు జ్ఞాపకాలు.. భావోద్వేగాలను నియంత్రించే హిప్పో క్యాంపస్.. ఎమిగ్డలా  అనే రెండు ప్రాంతాలు పెరుగుతాయని ఆయన వివరించారు. దీంతో కార్యనిర్వహాక సామర్థ్యానికి సంబంధించిన కార్టెక్స్ లోని కణజలం సన్నబడుతుందని పేర్కొన్నారు.

కోవిడ్ ముందు ఆ తర్వాత 163 మంది పిల్లలకు ఎంఆర్ ఐ స్కాన్లను పరిశీలిస్తే.. లాక్డౌన్ల సమయంలో ఈ వృద్ధి బాగా కన్పించిందని పేర్కొన్నారు. సాధారణంలో పిల్లలు హింసకు గురైన. నిర్లక్ష్యానికి గురైన.. కుటుంబంలో కలతలు ఎదురైనా సమయంలో పిల్లల మొదడు శారీరక వయస్సు కంటే ఎక్కువగా వృద్ధి చెందుతుందన్నారు. కానీ కోవిడ్ సమయంలో టీనేజర్ల శారీరక వయస్సు కంటే మానసిక వయస్సు ఎన్నో రెట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కారణంగానే 16 ఏళ్ళ కుర్రాడు 70.. 80 సంవత్సరాల వృద్ధుల లాగా మారుతున్నారన్నారు. 16 ఏళ్ళకే జ్ఞాపక శక్తిని కోల్పోయే పరిస్థితి వస్తుందని.. ఈ సంకేతాలను చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని ఈ పరిశోధనల్లో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ కు చెందిన ప్రొఫెసర్ జానాస్ మిల్లర్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు.

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!