- శనివారం ఊరేగింపుగా గౌరమ్మ ఉత్సవం
- ఆదివారం ఉదయం నిమజ్జనం
జనసముద్రం న్యూస్, దేవగిరి, బొమ్మనహాల్: నాలుగు రోజులపాటు జరిగే గ్రామ దేవత గౌరమ్మ పూజలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న దేవాలయంలో గౌరమ్మ ప్రతిమను గ్రామస్తులు కొలువుదీర్చారు. భక్తిశ్రద్దలతో దేవీ ప్రతిమను దేదిప్యమానంగా అలంకరించారు. నాలుగు రోజుల పాటు నిత్యమూ పూజలు జరిగిస్తారు. మేళ తాళాలతో, భక్తిశ్రద్దలతో శనివారం గ్రామమంతా గౌరమ్మను ఊరేగింపుగా తీసుకెళతారు. ఆదివారం ఉదయం నిమజ్జనం గావిస్తారు. గౌరమ్మ పూజా వేడుకల కార్యక్రమం ప్రతి ఏడాది అనేక సంవత్సరాలుగా దేవగిరి గ్రామంలో సాంప్రదాయికంగా నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.