ప్రముఖ డేటింగ్ యాప్ ‘టిండర్’లో రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తోంది. నచ్చిన అమ్మాయితో డేటింగ్ చేసుకోనే అవకాశం టిండర్ లో ఉండటంతో యూత్ ఈ యాప్ కు అడిక్ట్ అవుతున్నారు. దీనిని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఫేస్ బుక్.. ఇన్ స్ట్రాలో నుంచి అమ్మాయిల ఫోటోలను అప్లోడ్ చేసి డేటింగ్ పేరుతో కిడ్నాప్ లకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. టిండర్ యాప్ లో మోసాలు ఎక్కువగా బ్రెజిల్ లోని ధనిక నగమైన సావోపాలో వెలుగు చూస్తున్నాయని తాజాగా వెల్లడైంది. ఈ ప్రాంతంలో నమోదవుతున్న కిడ్నాప్ కేసుల్లో 90శాతం టిండర్ యాప్ బాధితులే ఉంటున్నారని తేలింది. ఈ క్రమంలోనే 2022 ఏడాదిలో ఏకంగా 94 కిడ్నాప్ కేసుల్లో 250 మంది స్థానిక పోలీసులు అరెస్టు చేశారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో యువతతో పాటు 40 ఏళ్లు పైబడిన మగవాళ్లు.. ఒంటరిగా ఉండే వాళ్లు ఎక్కువగా పడుతున్నారు. కేటుగాళ్లు ముందు సోషల్ మీడియా నెట్ వర్క్ లలో టార్గెట్ చేసే వ్యక్తి యొక్క ఆర్థిక స్థాయిని గమనించి ఆ తర్వాత మెల్లిగా డేటింగ్ పేరుతో అమ్మాయిలను ఎరవేసి ముగ్గులోకి లాగుతున్నారు. దీంతో ఈ కేటుగాళ్ల వలలో పడే వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది.
ఇటీవల నగరంలోని ప్రముఖ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యుడు డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు వెళ్లి 14 గంటలపాటు నేరస్థుల చేతిలో బందీ అయ్యాడు. ఇక అతని ఖాతాలోని 14వేల డాలర్లను కేటుగాళ్లు కాజేశారు. టిండర్ యాప్ లో వ్యక్తిగత సమాచారం పంచుకునే వారిపై సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కన్నువేసి ఉంచుతున్నారు.
అంతర్జాతీయ పర్యటనలు.. విలాసవంతమైన కార్ల ఫోటోలు పెట్టి వారిని టార్గెట్ చేస్తున్నారు. టిండర్ యాప్ లో పరిచయమైన వారిని సాయంత్రం వేళ్లలో.. మారుమూల ప్రాంతాల్లో కలుసుందామని చెప్పి అవతలి వ్యక్తులను ముగ్గులోకి లాగుతున్నారు. వారి మాటలు నమ్మి వెళ్లిన వారిని నిలువునా క్షౌరం చేసి పంపుతున్నారు. ఒక్కొసారి శారీరకంగా.. మానసికంగా హింసించిన ఘటనలు కూడా ఉన్నాయి.
డేటింగ్ యాప్ లో మోసపోయిన బాధితులు ఎక్కువగా ఉంటున్నప్పటికీ కేసులు పెట్టేందుకు వారంతా ఇష్టపడటం లేదని పోలీసులు చెబుతున్నారు. సమాజంలో తమ పరువు పోతుందనే భయంతో వారంతా మిన్నకుండిపోతున్నారు. ఈ నేపథ్యంలనే డేటింగ్ యాప్స్ కు అట్రాక్ట్ అయ్యే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎవరితో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచిస్తున్నారు. అపరిమిత వ్యక్తులు ఎక్కడికైనా పిలిచినప్పుడు ఒంటిరిగా వెళ్లకూడదని పేర్కొన్నారు. వీలైనంత వరకు ఇలాంటి డేటింగ్ యాప్ ల జోలికి వెళ్లకుంటేనే మనీ.. ఒళ్లు గుల్లా కాకుండా ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆ తర్వాత మీ ఇష్టం..!
ఇద్దరిపై గంజాయి కేసు నమోదు
Spread the love జనసముద్రం న్యూస్ గాంధారి డిసెంబర్ 12 గాంధారి మండలం నేరేళ్ తండా గ్రామంలో గంజాయి సరఫరా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు తేదీ 10.12.2024 నాడు సాయంత్రం సమయంలో గాంధారి SI ఆంజనేయులు మరియు తన సిబ్బందితో…