వివాదాలకు పుల్ స్టాప్..చంద్రబాబు,లోకేష్ లకు బహిరంగ క్షమాపణలు చెప్పిన తోపుదుర్తి చందు

Spread the love

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నయ్య  చంద్రశేఖర్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు.  ఈ నెల 24వ తేదీన రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో  ఆయన టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్లనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం సృష్టించాయి. ఆ వ్యాఖ్యలు వివాదస్పదమై సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అప్పట్లో మొద్దుశీనుకు ఒక్క మాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోకి దూరి చంపేసేవాడని తోపుదర్తి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టించాయి.  దీనిపై తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. వైసీపీ నేతల హత్యా రాజకీయాలను తెలుగుదేశం శ్రేణులు దుయ్యబట్టాయి. రాష్ట్రంలోని పలు చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నయ్య తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపైన కేసులు పెట్టారు.ఈ వ్యాఖ్యలతో అనంతపురం జిల్లా గత రెండు మూడు రోజులుగా అట్టుడికి పోతోంది. ముఖ్యంగా పరిటాల రవి కుటుంబం తోపుదుర్తి కుటుంబానికి మధ్య రాప్తాడులో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. పరిటాల సునీత ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్లు రాప్తాడులో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.  వేలాది మంది తమ అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో రాప్తాడు పోలీసు స్టేషన్కు  తరలి వచ్చి ధర్నా చేశారు. ఎమ్మెల్యే సోదరుడ్ని అరెస్టు చేయాలని డిమాండు చేశారు.  దీనికి పోటీగా వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు అభిమానులు కూడా పెద్దఎత్తున పోటీ ధర్నాలు చేశారు.

ఈ పోటా పోటీ ధర్నాలు ఆందోళనలతు రెండు రోజులుగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అట్టుడికిపోతోంది. తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.  తన అన్న మాటలను వైసీపీ ఎమ్మెల్యే పరోక్షంగా వెనకేసుకు వచ్చారు.ఆయన వాడిన భాష తప్పు కానీ భావంలో మాత్రం ఎలాంటి తప్పు లేదన్న మాటలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో సోమవారం కూడా రెండు వర్గాలు పోటాపోటీ ర్యాలీలు ఆందోళనలతో హరెత్తించాయి.  ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని మరింత సాగదీయకుండా ఉండేలా అటు పోలీసులు ఇటు వైసీపీ అధినాయత్వం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మంతనాలు సాగించాయి. చివరకు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి తన అభిమానులు ప్రజలతో కలిసి జిల్లా ఎస్పీని కలిగి తాను చేసిన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణలు చెప్పారు.

తమ విధానాలు చెప్పే క్రమంలో  చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై ఆవేదనతో ఏదైనా మాట్లాడి ఉంటే ఈ ప్రజల తరఫున పార్టీ శ్రేణుల తరఫున తాను క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. తన బాధను మీడియా ద్వారా వెల్లడించాలని అనుకున్నాని అందుకే జిల్లా ఎస్పీని కలిశానని చెప్పారు.  తన వ్యాఖ్యలు బాధ కలిగించి ఉంటే క్షమాణలు కోరుతున్నాని తెలిపారు.  ఐటీడీపీ వారు ఇక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చి తనపైనా తన కుటుంబ సభ్యులపైన పనిగట్టుకుని కామెంట్లు పెట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నయ్య క్షమాణలు చెప్పడంతో ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందని అనంతపురం జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ వారు పరిటాల కుటుంబం దీనిపైన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

  • Related Posts

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    Spread the love

    Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు