ఆ రోజు పరిటాల రవిని చంపింది వైఎస్, ఆయన తనయుడు జగనే

Spread the love

తోపుదుర్తి చందును అరెస్ట్ చేసి.. జిల్లా బహిష్కరణ చేయాలి

జగ్గుపై కేసు నమోదు చేయడంలో ఉన్న శ్రద్ధ చందుపై లేదా

చంద్రబాబును దూషించిన విషయంలో మేము పెట్టిన కేసు ఏమైంది

మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం

మీరు మాపై ఎన్ని కేసులు పెట్టినా.. మేము భయపడం.. బీకే పార్థసారధి

ధర్మవరం సబ్ జైలులో జగ్గును పరామర్శించిన టీడీపీ నేతలు

ధర్మవరం,( జనసముద్రం న్యూస్)

పరిటాల రవిని చంపింది అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన కుమారుడు వైఎస్ జగన్ అని ఆ రోజు నుంచి మేము చెబుతూనే ఉన్నామని.. ఇవాళ తోపుదుర్తి చందు వ్యాఖ్యల మీద నిజమని తేలిపోయిందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మొన్న అర్ధరాత్రి అరెస్టు కాబడిన గంటాపురం జగ్గును టీడీపీ నేతలు ధర్మవరం సబ్ జైలులో పరామర్శించారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే పార్థసారధి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, కళ్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గ ఇన్ ఛార్జిలు ఉమామహేశ్వర నాయుడు, బండారు శ్రావణిలతో పాటు పలువురు ముఖ్య నాయకులు సబ్ జైలు వద్దకు వచ్చారు. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందన్న అంశం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ తోపుదుర్తి చందు చేసిన వ్యాఖ్యల మీద రాప్తాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని.. అయితే దానిని చెత్త బుట్టలో పడేశారన్నారు. కానీ చంద్రబాబుని దూషించారన్న ఆవేశంలో గంటాపురం జగ్గు ఏదో మాట్లాడితే అర్ధరాత్రి వెళ్లి అరెస్టులు చేశారన్నారు. అదే రోజు రాత్రి వైసీపీ నాయకులకు చెప్పి.. దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ధర్మవరం డివిజన్ పోలీసులు లేరా జగ్గును అరెస్టు చేసేందుకు చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఎందుకు అంత అత్యుత్సాహం అని ప్రశ్నించారు. అందుకే చెన్నేకొత్తపల్లి ఎస్ఐతో పాటు రామగిరి సీఐను సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చందును జిల్లా బహిష్కరణ చేయాలన్నారు. గతంలో పరిటాల రవిని చంపిన మొద్దుశీనుకు వైఎస్ చెప్పి ఉంటే చంద్రబాబును కూడా చంపి ఉండేవారని నిజాలు చెప్పారన్నారు. ఆ రోజు నుంచి మేము చెబుతున్న విధంగా ఈ హత్యల వెనుక వైఎస్ ఆయన కుమారుడు జగన్, ప్రకాష్ రెడ్డి సోదరులు ఉన్నారని ఆరోపించారు. ఇప్పుడు లోకేష్ ను టార్గెట్ చేస్తామని అంటున్నారని.. లోకేష్ కు అండగా లక్షలాదిగా టీడీపీ శ్రేణులు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సునీత అన్నారు…

కేసులకు భయపడం… మాజీ ఎమ్మెల్యే పార్థసారధి

తోపుదుర్తి చందు ముందు చంద్రబాబును దూషించారని ఆయన పై చర్యలు తీసుకోకుండా జగ్గును అరెస్ట్ చేయడం అంటే పోలీసులు ఎంత ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందన్నారు. అందుకే వారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇలాంటి కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారని.. అది ఎప్పటికీ సాధ్యం కాదని మేము కేసులకు భయపడమని పార్థసారధి తేల్చి చెప్పారు…

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!