పరిటాల డౌన్ డౌన్..ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద నుండి ఎస్పీ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణుల భారీ ర్యాలీ

Spread the love

ఎమ్మెల్యే ఇంటివద్ద నుంచి ఎస్పి కార్యాలయం వరకు భారీ ర్యాలీ.

తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి కలిసి అడుగులేసిన పార్టీ శ్రేణులు.

చంద్రబాబు, రామోజీరావు సలహాతో పరిటాల సునీత, శ్రీరామ్‌ ప్రోద్భలంతో టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడికి వచ్చారు.

మమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న చంద్రబాబు, పరిటాల సునీత, శ్రీరామ్‌ తదితరులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

జిల్లా ఎస్పీ కలిసి ఫిర్యాదు చేసిన తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి గారు.

అనంతపురం రూరల్,( జన సముద్రం న్యూస్):వచ్చే ఎన్నికల్లో ఓటమిని తప్పించుకునందుకు తోపుదుర్తి కుటుంబంపై అభాండాలు వేస్తున్న ‘పరిటాల’ డౌన్‌డౌన్‌… టిడిపి గూండాల్లా ఖబడ్దార్‌ అంటూ వైసిపి శ్రేణులు గాండ్రించాయి. సోమవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామంటూ టిడిపి నాయకులు ప్రకటించడంతో సమాచారం అందుకున్న  వైసిపి శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. వైసిపి సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎస్పి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు, రామోజీరావు సలహాతో పరిటాల సునీత, శ్రీరామ్‌ ప్రోద్భలంతో టిడిపి గూండాలు మా ఇంటిపై దాడికి వచ్చారని పోలీసులు సకాలంలో స్పందించి అడ్డుకున్నారని తోపుదుర్తి చందు ఎస్పీ వివరించారు. వారందరిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తోపుదుర్తి చందు మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో రాప్తాడులో గెలవలేమని తెలిసే చంద్రబాబు, రామోజీరావు, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ తదితరులు కలిసి నిత్యం ప్రజా సేవ చేస్తున్న మా సోదరుడు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మా కుటుంబ సభ్యులపై దుస్ప్రచారాలు, అసత్యప్రచారాలు చేస్తూ వ్యక్తిత్వహరించే చర్యలకు పాల్పడుతున్నారు. మీకు మీడియా ఉందని ఇష్టమొచ్చినట్లు మామీద అభాండాలు వేస్తూ కథనాలు రాయిస్తుంటే మాకెంత బాధ ఉంటాది. గెలిచినప్పటి నుంచి ప్రజాసేవ చేస్తున్న తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి పైన, మాకుటుంబ సభ్యులపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ కథనాలు రాయిస్తే బాధకాదా.

మీ ప్రభుత్వంలో ఏర్పాటు కావాల్సిన ఫేజ్‌ కంపెనీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దాన్ని మామీద రుద్దుతారా? ప్రజలకు సేవ చేసుకుంటున్న ఎమ్మెల్యేపై అన్యాయంగా, దుర్మార్గంగా ఇలాంటి కథనాలు రాయిస్తున్నారు.  చైతన్యరథం పేరుతో ఐటిడిపి వారు వెలువరిస్తున్న ఆన్‌లైన్‌ పేపర్‌లో మా అమ్మ, నాన్న, ఇతర కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేసేవిధంగా కథనాలు రాయిస్తారా?  ఇదేనా భవిష్యత్‌ తరాలకు నేర్పించేది. 

వయసులో పెద్దోడిని చంద్రబాబుకు గౌరవిస్తాం. అపద్దాలు చెబుతూ దాన్ని నిజం అని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నవాబుల నగరం అనేది అందరికీ తెలసు. అయినా చంద్రబాబు తానే నిర్మించానని  చెబుతూ  నమ్మించాలని చూస్తున్నారు. హైదరబాద్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేసింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి .  ఐటీ పార్క్‌కు శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి.  చంద్రబాబు చేయని వాటిని కూడా చేసినట్లు ఓ వర్గం మీడియాను అడ్డుపెట్టుకుని దుస్ప్రచారం చేస్తున్నారు. వయసులో పెద్దవాడు ఇలా అపద్దాలు చెబితే ఎలా.

న్యాయబద్దంగా ఉంటూ ఆదర్శంగా ఉండాల్సిన పెద్ద మనిషి వ్యక్తిత్వాన్ని హరించేలా జగన్‌మోహన్‌రెడ్డి మొదలు ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతున్నారు. గాలి నాకొడుకు అని మాట్లాడతారా?.  చంద్రబాబు గురించి తాను మాట్లాడితే మీకు బాధ కల్గిందా? మరి జగన్‌మోహన్‌రెడ్డి గురించి పశుభాష మాట్లాడితే మాకెంత బాధ ఉంటాది. భవిష్యత్‌ తరాలకు నేర్పించేది ఇదేనా?  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే క్రమంలో మేం సమిధలయ్యేందుకు కూడా సిద్ధం.

ఆరోజు ప్రాణాలను ఫణంగా పెట్టి పరిటాల రవీంద్ర దౌర్జన్యాల మీద ఉద్యమించాం.. ఈరోజు కూడా ఇలాంటి దుర్మార్గులను ఎదుర్కొనేందుకు మా ప్రాణాలు వీడేందుకు కూడా సిద్ధం. మా జెండా..అజెండా వైఎస్సార్‌ మాత్రమే.

వైఎస్‌ ఏరోజు కూడా ఫ్యాక్షన్‌ను ఎంకరేజ్‌ చేయలేదు.దన్నార  30 ఏళ్లుగా రాప్తాడు ప్రాంతం తీవ్ర అన్యాయానికి గురైంది. అనేకమంది హత్యలకు గురయ్యారు. రెండు కుటుంబాల మధ్య ఉన్న ఫ్యాక్షన్‌ను రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నాయి. వాటన్నింటినీ అధిగమించి ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా శశ్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పైనా, ఎమ్మెల్యేపైనా ఉన్మాదంగా రాతలు రాయడం భావ్యమా.

  • Related Posts

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    Spread the love

    Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు