— ఆత్మీయ వీడ్కోలు సభలో అనంతపురం రేంజ్ డి.ఐ.జి, జిల్లా ఎస్పీల వెల్లడి
అనంతపురం: జిల్లా సెబ్ అదనపు ఎస్పీగా జె.రాంమోహనరావు, డీఎస్పీగా రాఘవరెడ్డిల విధులు ప్రశంసనీయమని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ IPS గారు, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు అభిప్రాయపడ్డారు. నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొంది ఏసిబి విభాగానికి వెళ్తున్న జె.రాంమోహనరావు, విజిలెన్స్ విభాగానికి వెళ్లిన డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డిలకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో వీడ్కోలు సభ నిర్వహించి ఇద్దర్నీ సత్కరించారు. డి.ఐ.జి, జిల్లా ఎస్పీలతో పాటు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ IPS గారు, 14 th బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి అజిత వేజెంండ్ల IPS గారు పాల్గొని ప్రసంగించారు. అనంతపురం జిల్లా సెబ్ విభాగం అదనపు ఎస్పీగా జె.రాంమోహనరావు సమర్థవంతంగా పని చేశారని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల మద్యం, నాటు సారా మరియు ఇసుక అక్రమాల కట్టడికి తీవ్రంగా కృషి చేశారు. అదేవిధంగా అనంతపురం డీఎస్పీగా జి.వీర రాఘవరెడ్డి అంకితభావంతో పని చేశారని గుర్తు చేశారు. సమాజ విపత్తు అయిన కరోన మరియు గ్రామ పంచాయతీ, ప్రాదేశిక, పురపాలక ఎన్నికల నిర్వహణలో ఇద్దరు అధికారులు బాగా కష్టించారని అభినందించారు. అనంతరం ఇద్దరు అధికారులను డి.ఐ.జి, ఎస్పీలు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, హనుమంతు, శ్రీసత్యసాయి జిల్లా అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ , పలువురు డీఎస్పీలు, సి.ఐ లు, ఆర్ ఐ లు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.