మూడేళ్ల క్రితం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి ప్రస్తుత సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి ఇంకా మరికొందరు ఉన్నారని వారిని విచారించాలని తాజాగా పులివెందుల కోర్టులో ఒక వాగ్మూలం నమోదు అయింది. ఈ వాగ్మూలం ఇచ్చిన వారు ఈ కేసులో అయిదవ నిందితుడు వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారి ఆయనే అని సీబీఐ నమ్ముతున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ.
ఆమె ఈ కేసుకు సంబంధించి మరో ఆరుగురిని విచారించి వాస్తవాలను వారి నుంచి రాబట్టాలని సీబీఐని కోరింది. ఈ మేరకు ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో దాఖలు చేసిన పిటిషన్ మీద పులివెందుల కోర్టు ఆమె నుంచి వాగ్మూలాన్ని సేకరించింది.
మరి తులసమ్మ చెప్పిన ఆ ఆరుగురిలో మొదటి వారు వివేకా సొంత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండవ వారు ఆయన బావమరిది శివ ప్రకాష్ రెడ్డి అలాగే కొమ్మ పరమేశ్వర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజేశ్వర్ రెడ్డి నీరుగుట్టు ప్రసాద్ లను కూడా విచారించాలని తులసమ్మ కోర్టుని కోరారు. మరి ఈ కేసులో సీబీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ వారిని కనుక విచారిస్తే మాత్రం కచ్చితంగా కీలకమైన పరిణామమే అని అంటున్నారు.
నిజానికి ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అయితే కచ్చితంగా తమకు సంబంధం లేదని అంటున్నారు. పైగా వైఎస్ ఫ్యామిలీ వారి ప్రమేయాన్ని కూడా ఆయన చెబుతూ వస్తున్నారు. కానీ ఇపుడు తులసమ్మ ఆయన పేరు ఎందుకు చెప్పింది అన్నదే ఆసక్తికరం. అదే విధంగా సీబీఐ విచారించాల్సిన మరో పేరుగా వివేకా అల్లుడి పేరుని తులసమ్మ చెబుతున్నారు. మరి అల్లుడు ఏమి చెబుతారు. ఆయనకు ఈ కేసు విషయంలో ఎంతవరకూ సంబంధం ఉంది అన్నది కూడా చూడాలని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఈ కేసు మూడేళ్లుగా అలా నలుగుతూనే ఉంది. ఒక కొలిక్కి రాలేదు. అదే టైంలో ఈ కేసు విచారణకు వైసీపీ సర్కార్ నుంచి వత్తిళ్ళు వస్తున్నాయని ప్రచారం సాగుతున్న నేపధ్యం ఉంది. ఈ కేసు తొందరగా తేలి నిందితులు ఎవరో తేలలీ అంటే పక్క రాష్ట్రానికి అప్పగించాలని కూడా వివేకా కుమార్తె సునీత కోరారు.
దాని మీద విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ తీర్పుని ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ క్రమంలో తులసమ్మ వాగ్మూలం కొత్త ట్విస్ట్ లకు అవకాశం కల్పించిని అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ కేసు విషయంలో మరెన్ని మలులుపు ఉంటాయో ఏమిటి అన్నది కూడా ఇపుడు ఆసక్తికరమైన పరిణామంగా మారింది అంటున్నారు.