రైతుల కోసం పాదయాత్ర కాదు పరిటాల ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న పాదయాత్ర.

Spread the love

రాప్తాడు,( జనసముద్రం న్యూస్):-

చంద్రబాబుకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే పరిటాల సునీతకు దత్త పుత్రుడు సిపీఐ రామకృష్ణ.

అబద్ధాలు కూడా నిజం అని నిరూపించే తత్వం పరిటాల సునీతది.

నియోజవర్గంలో అమాయకపు రైతుల నుంచి భూములు దౌర్జన్యంగా లాక్కుని పరిటాల వర్గం.

రాప్తాడులో డిపాజిట్లు కూడా రావనే ధర్మవరం, పెనుకొండ సీట్లు కావాలని పరారి మంత్రం పటిస్తున్న పరిటాల కుటుంబం.

రాప్తాడు నియోజవర్గం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి (చందు)

బుధవారం రాప్తాడు మండలం ఎంపిడివో కార్యాలయం నందు విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా రాప్తాడు నియోజవర్గం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి (చందు) మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని గత 40 నెలలుగా నియోజకవర్గం వైపు చూడని పరిటాల కుటుంబం మాకు ధర్మవరం సీటు కావాలి, పెనుకొండ సీటు కావాలని పరారి మంత్రం పటిస్తున్నారు. చంద్రబాబు. ఆ సీట్లును ఇప్పటికే అమ్మేసుకున్నారు.వైఎస్ఆర్సిపి పై బురదజల్లే కార్యక్రమాలు చేపడతూ చంద్రబాబు పరిటాల కుటుంబానికి చెప్పి పంపారు. దీంతోనే పరిటాల సునీత ఈ మాధ్య రైతుల గురించి మాట్లాడుతూ పాదయాత్రల పేరుతో తిరగడం ప్రారంభించింది.రైతుల ప్రతి అవసరాన్ని సచివాలయాలే గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లేదా ఒక ప్రజాప్రతినిధి అవసపరం లేదనే మినిమం కామన్ సెన్స్ కూడా లేనటువంటి పరిటాల సునిత పాదయాత్ర చేస్తోంది. దీనికి రెండుమూడు రోజుల ముందు జాకీ కంపెనీని తాము పంపామంటూ మాపై లేనిపోని ఆరోపణలు చేసి కలరింగ్ ఇచ్చింది.రాప్తాడు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా కరువు కాటకాలే. ఈరోజు కరువు కాటకాలులేవు, చెరువుల నిండా నీళ్లు. పేరూరు డ్యాం పొంగి పొర్లుతోంది. గత 30 ఏళ్లుగా పరిటాల కుటుంబం రాజ్యమేలుతున్న తరుణంలో కరువుతో వేలాదిమంది రైతులు వలసలు వెళ్లారు. పేరూరు ఆయకట్టు గ్రామాలన్నింటికీ పిల్లకాలవల డిస్ట్రిబ్యూటర్లకు నీళ్లిచ్చాం. అందుకే పరిటాల సునీత కళ్లల్లో కన్నీరు. పేరూరు డ్యాంకు ఎలా నీళ్లు తీసుకుని వచ్చింది జిల్లా ప్రజలకు తెలుసమ్మా.. 27 వేల ఇళ్లను మంజూరు చేయించా. ఎన్నికల లోపు 20 వేల ఇళ్ల నిర్మాణాలు చేస్తా. 10 వేలమంది పాడి మహిళా రైతులకు డెయిరీ నిర్మిస్తున్నా రైతులకు ఉచితంగా 6 వేల బోర్లు వేస్తున్నాం. కేంద్రం నిధులతో బోర్లు వేస్తున్నారని పరిటాల సునీత అపద్దాలు పండుతోంది. అమ్మా.మీరు ఏదైనా చేసి ఉంటే చెప్పుకోండి. మీరు దొంగ చెక్కులు ఇస్తే మేము డబ్బులు ఇచ్చాం. మీరు బలవంతంగా భూములు లాక్కుంటే మేము భరోసా ఇచ్చాం. మీరు ఇళ్లు కూల్చారు…మేం ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. గతంలో నీ ప్రజాకంఠక వైఖరి, దోపిడీ వల్ల, నువ్వు నీతమ్మళ్లు సాగించిన దౌర్జన్యాల వల్ల అణిచివేతకు గురైన ప్రజలు తిరగబడినారు. మరూరు చెర్లోపల్లిలో నీ కొడుకు మీద తిరగబడినారు. నీ తమ్ముడి మీద గొందిరెడ్డిపల్లిలో రాళ్లు రువ్వారు. తోపుదుర్తిలో నీమీద చెప్పులు విసిరారు. నీ కొడుకు కాన్వాయ్ మీద రాళ్లు వేశారు. అలాంటి తిరుగుబాటు మళ్లీ రాకూడదు. అందుకే నువ్వు జనాల్లోకి వస్తుంటే నీకు రక్షణ కల్పించాం తల్లీ.వాస్తవానికి చదువు రాదుకానీ.. అపద్దాలు వండి వార్చడంలో పరిటాల సునిత పీహెచ్ డీ చేసింది.కేవలం ఎత్తిపోయిన సంస్ధామైన టిడిపిని జాకీలు పెట్టి మీరు పైకి లేపుతున్న ప్రయత్నం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. టిడిపి ప్రభుత్వంలో ఎంఓయూ చేసుకున్న లోకస్ సెక్టార్, రాయల్ ఎక్స్పోర్ట్స్ తదితర
14 కంపెనీలకు ఎందుకు భూములు ఇవ్వలేదు. భేరాలు కుదరక ఇవ్వలేదా?

ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్రైడ్డి జయలక్ష్మిసత్యనారాయణ రెడ్డి , జెడ్పీటీసీ పసుపుల హేమవతిఅది, మండల కన్వీనర్ జూటురు శేఖర్ , ఎంపీటీసీలు, సర్పంచులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!