2023 ఎన్నికల టికెట్లపై కెసిఆర్ కసరత్తు షురూ..!

Spread the love

ముచ్చటగా మూడోసారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో గులాబీ బాస్ తన చేతిలోని అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ షురూ చేశారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటి నుంచే సర్వేలు చేస్తున్నారు.  ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు నేతల పనితీరు పార్టీ పరిస్థితి ఆధారంగా నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించారు. సర్వేల ఆధారంగా ఖచ్చితంగా  గెలిచే ట్రాయంగిల్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలను గుర్తించి మూడు కేటగిరీలుగా పరిగణించారు. ఖచ్చితంగా గెలిచే కేటగిరి ఏలో 38 నుంచి 44 కాంగ్రెస్ బలంగా ఉండి కాస్త కష్టపడితే గెలిచే బి కేటాగిరిలో 30-35 నియోజకవర్గాలను గుర్తించారు.
ఇక ట్రాయాంగిల్ ఫైట్ లో బీజేపీ కాంగ్రెస్ లతో పోరాడి వీక్ గా ఉన్న నియోజకవర్గాలను డేంజర్ జోన్ ‘సీ’గా కేసీఆర్ విభజించినట్టు తెలుస్తోంది. ఈ ‘సీ’ కేటగిరీ సీట్లలో ఏకంగా టీఆర్ఎస్ మంత్రులు కూడా ఉన్నారని.. వారి గెలుపు అసాధ్యం అని తెలిసి కొత్త వారికి టికెట్ ఇచ్చే యోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.ఈ సీ కేటగిరీ డేంజర్ జోన్ మంత్రులతో సహా 10 మందితో కూడిన జాబితా కేసీఆర్ కు అందిందని.. ఇక్కడ గెలుపు కోసం వేరే వ్యక్తులను ప్రచారం కోసం కేసీఆర్ బ్యాచ్ లు సిద్ధం చేస్తారని అంటున్నారు. మిగతా ఇన్ చార్జీలకు కూడా కేటగిరీల వారీగా ఇన్ చార్జీలను నియమిస్తారని చెబుతున్నారు.
మునుగోడులో గెలిచినా అంత ఖర్చు పెట్టి కేవలం 10వేల ఓట్ల తేడాతో గెలవడాన్ని కేసీఆర్ ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. బీజేపీ ఇంతలా ఓట్లు సాధించడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదు. ఈ క్రమంలోనే అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పరిస్థితిపై ఆరాతీసిన కేసీఆర్.. ఇప్పటి నుంచే పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో నివేదికలు సిద్ధం చేసిన కేసీఆర్.. మొత్తం 119 నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించారు. వాటిలో ఖచ్చితంగా విజయం సాధించేవి 40 ఉండగా.. కొంచెం కష్టపడితే గెలిచే నియోజకవర్గాలు 30-35 వరకూ ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు వీక్ గా ఉన్నట్టు నివేదికలు అందాయి.బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. విజయం కోసం ఆ నియోజకవర్గాల్లో బలమైన నేతలను.. ఇక మంత్రులు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. త్వరలోనే ఇన్ చార్జీలను నియమించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. 

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!