అసభ్య సందేశాల సాకుతో అకౌంట్లను తాత్కాలికం గా నిలిపివేస్తూ న్న ఫేస్బుక్
మండి పడుతున్న నెటిజన్లు
జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,నవంబర్6:
ఫేస్బుక్ లో పలు రాజకీయ మతపరమైన చర్చలలో అవతలి వ్యక్తి పెట్టే సందేశాలతో ఉపయోగించే పదాల స్థాయిని బట్టి తాము పెట్టే సందేశాలను అసభ్య సందేశాలు గా నిర్ణయించి తమ యొక్క ఫేస్బుక్ అకౌంట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నరని పలువురు చెబుతున్నారు,,ఇదివరకు ఫేస్బుక్ లో పలు అంశాలపై జరిగే చర్చలలో కొన్ని అవతలి వ్యక్తుల వద్దనుంచి వచ్చే సందేశాలలో వారు ఉపయోగించే పదాల ఆధారంగా తాము వారికి పెట్టే సందేశాలలో ఒక వేళ ఏవైనా అసభ్యకర పదాల్ని ఉపయోగించిన పెద్దగా పట్టింపు వుండేది కాదని కానీ ఇప్పుడు ఏదైనా పొరపాటున అవతలి వ్యక్తి పెట్టే సందేశానికి జవాబు గా తాము పెట్టే సందేశం లో ఏదైనా ఏదైనా అసభ్యపదం ఉపయోగిస్తే తాత్కాలికంగా అకౌంట్ ను అపివెస్తున్నరని చెబుతున్నారు,,ఒక వేళ అసభ్య పదానికి బదులుగా ఏదైనా సాంప్రదాయకమైన పదాన్ని ఉపయోగించిన సరే అకౌంటును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గా సందేశం వస్తుంది అని చెబుతున్నారు,,అలాగే నిత్యం మన జీవితంలో అనుకొని సంఘటనలు ఎదురైనప్పుడు నిత్యం వాడుకలో వున్న పదాలను ఫేస్బుక్ కీ సందేశంలో పెట్టే సందేశంలో ఉపయోగించిన సరే ఆ సందేశాన్ని కూడా అసభ్యసందేసంగా పరిగణించి అకౌంట్లను నిలిపివేస్తున్నట్లు గా సమాచారం వస్తుంది అని చెబుతున్నారు,,ప్రపంచంలో దేశంలో నిత్యం జరిగే రాజకీయ పరమైన మతపరమైన అలాగే ప్రకృతి పరమైన వినోద పరమైన సంఘటనలపై తమ యొక్క అభిప్రాయాన్ని తమ యొక్క భావజాలాన్ని తెలియజేసే హక్కు అలాగే తమయొక్క భావోద్వేగ పూరితమైన అభిప్రాయాన్ని ఫేస్బుక్ ద్వారా తెలియజేసే హక్కు ఫేస్బుక్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ వుంది అని కానీ ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ అవలంభిస్తున్న విధానం వలన ఫేస్బుక్ ద్వారా తమ యొక్క అభిప్రాయాలను భావాలను ఫేస్బుక్ లో సందేశం ద్వారా తాము తెలియజేయాలేక పోతున్నామని పలువురు నేటిజన్లు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు,,,ఇప్పటికైనా ఫేస్బుక్ తన యొక్క నిబంధనలను కొంత మేర సడలించాలని తామంతా కోరుకుంటున్నామని చెబుతున్నారు,,