— మేము చేసిన అప్పులతో పేద ప్రజలను ఆదుకున్నాం
— టిడిపి నేతలు జేబులు నింపుకోడానికి అప్పులు చేశారు
— అప్పులు, పరిశ్రమలపై సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి యనమల వ్యాఖ్యలు అర్థరహితం
— పవన్ పై హత్యాయత్నం చేసే అవసరం మాకేంటి?
— రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,నవంబర్6,
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాల్లో చేసిన అప్పులు వాటిని ఖర్చు చేసిన విధానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. శనివారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయం నాటికి ఆంధ్రప్రదేశ్ కు 1,20,000 కోట్ల రూపాయల అప్పు ఉండేదని, 2014లో