మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

Spread the love

పాముదుర్తి ప్రాథమిక హై స్కూల్ లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం పై ఆగ్రహం వ్యక్తం చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి, జన సముద్రం న్యూస్, జూలై 26:-

పుట్టపర్తి నియోజకవర్గం లోని బుక్కపట్నం మండలం పాముదుర్తి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం సక్రమంగా లేదని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి భోజనం మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా పెడతారా అని మధ్యాహ్నం భోజన ఏజెన్సీ నిర్వాహకుల పైన అక్కడున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుల పై తీవ్ర ఆసహనాన్ని వ్యక్తం చేశారు. మారాల పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కి ఆ పాఠశాల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడే సమీపంలో ఉన్న పాముదుర్తి ప్రాథమిక ఉన్నత పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే మధ్యాహ్న భోజనం చాలా అధ్వానంగా ఉన్నట్టు విద్యార్థులు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కి ఫోన్ ద్వారా తెలియజేశారు.వెంటనే ఆ పాఠశాలను ఎమ్మెల్యే విజిట్ చేసి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందించే అన్నం,ఆకుకూర పప్పు చాలా నీళ్లగా ఎంతో అధ్వాన్నంగా ఉందని ఎమ్మెల్యే పల్లె సింధూర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి ఆహారం పిల్లలకు ఇకపై పెట్టవద్దని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకట నరసమ్మను మధ్యాహ్న ఏజెన్సీ నిర్వాహకులు గిరిప్రసాద్ పిలిచి తీవ్రంగా మందలించారు.అన్నం, ఆకుకూర పప్పు,కోడి గ్రుడ్డు,మజ్జిగ తో కూడిన నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలని,ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారు.మీకు చేత కాకపోతే చెప్పండి మధ్యాహ్న ఏజెన్సీని రద్దుచేసి మరొకరికి అప్పగిస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు అందించే ఆహారం సక్రమంగా ఉందా లేదా అనే విషయాన్ని కనీసం పాఠశాల హెచ్ఎం పర్యవేక్షణ చేయకపోవడాన్ని తీవ్ర ఆసహనాన్ని వ్యక్తం చేశారు. పాఠశాలలో చదివే పేద విద్యార్థులందరూ మన మన పిల్లలే కదా మన ఇంట్లో మన పిల్లలకు కూడా ఇలాంటి ఆహారం పెడుతామా అని ప్రశ్నించారు.మన ఇంట్లో మన పిల్లలకు మంచి ఆహారాన్ని ఇస్తామో అలాంటి భోజనమే పాఠశాలలో కూడా నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలకు మధ్యాహ్న ఏజెన్సీ నిర్వాహకులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సూచించారు. అనంతరం 7వ తరగతి పాఠశాల విద్యార్థులకు ఇండియా భౌగోళిక పరిస్థితులపై ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక పాఠ్యాంశాన్ని బోధించారు.ఎమ్మెల్యే బ్లాక్ బోర్డుపై జాతీయ పక్షి నెమలి బొమ్మను వేసి విద్యార్థులతో జాతీయ పక్షి నెమలి చిత్రలేకాన్ని విద్యార్థులతో వేయించారు. మీకు మంచి ఆహారాన్ని భోజనం పెడుతున్నారా? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను,పౌష్టికాహారాన్ని అందిస్తోందని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత చదువులు అభ్యసించాలని కోరారు.విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలను బోధించాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు.

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!