ఘనంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

Spread the love

యువతకు మార్గనిర్దేశకులు మాజీ మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటి కి బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్

యువతకు మార్గ నిర్దేశకులు మాజీ మంత్రి కేటీఆర్

అభివృద్ధిలో రాష్ట్రానికి వన్నె తెస్తు దేశంలో అగ్రస్థానంలో రాష్ట్రం రాజకీయ దురంధరుడు కేటిఆర్

జన సముద్రం న్యూస్ జులై 25 నల్గొండ జిల్లా. దేవరకొండ

మాజీ మంత్రి తెలంగాణ ఐటీ కి బ్రాండ్ అంబాసిడర్ గా.ఉన్న కేటీఆర్.యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిరకాలం ప్రజాసేవలో సేవ కొనసాగాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం దేవరకొండ పట్టణంలో బస్ స్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ పురస్కరించుకొని కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ప్రజలందరి ఆశీర్వాదంతో కేటీఆర్ నిండ నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.లక్ష్యంతో రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలి,రాష్ట్ర రాజకీయాల్లో అడుగు వేసి ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నా గొప్ప నాయకుడు కేటీఆర్ అని ఆయన అన్నారు. ఆ రోజు రామాయణంలో రాముడు ఏ విధంగా లోకకళ్యాణం కోసం పరిపాలన చేశారో కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందని తెలిపారు.ఏ ఆశయంతో నైతే బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో ఆ ఆశయ సాధన కోసం తండ్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో అపర చాణక్యుడు అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి హబ్ గా మార్చి వేలాది మంది యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నింపిన యువ నాయకుడు కేటీఆర్ అన్నారు. నడక నడవడికలో మాటలో మంచితనం మచ్చలేని నాయకుడు కేటీఆర్ అని కితాబు ఇచ్చారు. ఉన్నత విద్యలు అభ్యసించి లక్షల్లో వేతనం ఉన్నా ఉద్యోగం వదిలి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అని అన్నారు. భవిష్యత్తులో కేటీఆర్ మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా నేడు రాష్ట్రంలో ఎదిగిందన్నారు. నేడు యువత అంతా కేటీఆర్ బాటలో పరిగెడుతున్నారు అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు టీవీఎన్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, గాజుల ఆంజనేయులు, నీల రవికుమార్, దండేకర్ ప్రసాద్,వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, కేతావత్ రవీందర్, కేతవత్ శంకర్, రమావత్ రమేష్, రమావాత్ తులిసీరాం,జనీబాబా, మకాం చంద్రమౌళి,రేపాని ఇద్దయ్య,పాత్లవత్ దశ్రు నాయక్,పొట్ట మురళి,పగిడిమర్రి నాగరాజు, నిరంజన్,పాత్లవత్ లక్ష్మణ్,సత్యనారాయణ, కడారీ సైదులు,పొట్ట మదు,జానీ, పగిడిమర్రి సతీష్, శిమర్ల శ్రీను,చాట్ల రాములు,మాడం రాములు,జమీర్ బాబా, వెంకటయ్య,జంగీర్,గండూరి లక్ష్మణ్, ఆడారాపు హరికృష్ణ,కొమ్ము ఉదయ్, గుండాల వెంకట్,ఎర్ర విజయ్, వడత్య గణేష్, జాఫర్,అశోక్, నూనె గోపాల్, జంగయ్య,శంకర్,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!