ఖానాపూర్ నియోజకవర్గం జన సముద్రం న్యూస్ జూన్ 18
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పిన అందులో పేర్లు చేర్చబడిన వారికి బియ్యం అందడం లేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు రేషన్ కార్డులో పేర్లు నమోదు అయిన బియ్యం రాకపోవడంతో వారు ప్రభుత్వంలో తీవ్ర ఆందోళన గా ఉన్నారు రేషన్ కార్డులో పేర్లు ఉన్న బియ్యం ఎందుకు రావట్లేదు అని డీలర్లను అడిగితే ఏమో మాకు తెలియదు పేర్లు ఉన్నాయి కానీ లబ్ధిదారులు ఇంతకుముందు ఉన్న వారికే బియ్యం మంజూరు అయినాయి కొత్తగా పేర్లు నమోదు అయినవారికి బియ్యం మంజూరు కాలేదు అంటూ రేషన్ డీలర్లు చెబుతున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్దమో తెలియని అయోమయంలో రేషన్ తీసుకునే ప్రజలు ఉంన్నారు. ఇప్పటికైనా స్పందించి రేషన్ కార్డులో ఉన్నవారికి బియ్యం అందేలా అధికారులు చూడాలని రేషన్ లబ్ధిదారులు కోరుకుంటున్నారు.





