కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ద్వారా బాల్య వివాహాలను నివారించవచ్చు
—మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)
జనసముద్రం న్యూస్ ఘట్కేసర్:-శామీర్ పేట్ ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి,ఎంపి ఈటెల రాజేందర్,ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్,ఆర్డీవో ఉపేందర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్న ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్,బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్.ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపల్ లో అదేవిధంగా విలీనం అయినా గ్రామాలకి 68 చెక్కులు అందజేశామని తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికల వివాహానికి ఆర్థిక సహాయం అందించడం.ఈ పథకం ద్వారా,బాలికల చదువుకు,ఆరోగ్యం మరియు ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుంది.ముఖ్యంగా ఇది బాల్య వివాహాలను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.కళ్యాణ లక్ష్మి పథకం మహిళలను సాధికారికంగా మరియు ఆర్థికంగా స్వతంత్రంగా చేస్తుంది.

ఈ పథకం అమలు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోతున్న వధువులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.వధువు తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆర్థిక నిధుల వంటి ప్రోత్సాహకాలు అందించబడతాయి.తద్వారా వధువు వివాహం సజావుగా మరియు ఆస్తి కారణంగా ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందని తెలుపుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్,మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్,కీసర ఆలయ ధర్మకర్త అమర్,డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు,ఉపాధ్యక్షుడు నాగరాజు,సహకార బ్యాంకు డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి,మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజి రెడ్డి,మాజీ సహకార బ్యాంకు డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు నర్సింగ్ రావు,సీనియర్ నాయకులు మాధవ రెడ్డి,యూత్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి,ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్,వెంకట్ రెడ్డి,సల్మాన్ మరియు అధికారులు,వివిధ హోదాలో ఉన్న నాయకులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.





