రూ.90 లక్షలకు పైగా పేరుకుపోయిన కరెంటు బిల్లులు
పలుమార్లు ట్రాన్స్ కో అధికారులు నోటీసులు జారీచేసిన స్పందించని మేనేజ్ మెంట్
హెచ్ పి పరిధిలోని కనెక్షన్ కావడంతో సరఫరా కట్
అంథకారంలోకి వెళ్లిన ఆరోగ్యవరం మెడికల్ సెంటర్.. అవస్థలు పడుతున్న రోగులు
జనసముద్రం న్యూస్, మదనపల్లి, జూన్ 18:- అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె లో ఉండే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ అంధకారంలోకి వెళ్ళింది. టీబీ వ్యాధికి వైద్యం అందించిన ప్రాఖ్యత ఆసుపత్రికి గడ్డుకాలం మొదలైంది. కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత రోజు రోజుకు రోగుల సంఖ్య తగ్గిపోవడం, ఉన్న అరకొర రోగులకు సేవలందిస్తూ వస్తున్న మేనేజ్మెంట్ కి మదనపల్లె ట్రాన్స్ కో అధికారులు మంగళవారం షాక్ ఇచ్చారు. సుమారు రూ.90 లక్షలకు పైగా కరెంటు బిల్లులు ప్రభుత్వానికి బకాయి పడడంతో ట్రాన్స్ కో అధికారులు కరెంట్ సరఫరా నిలిపేశారు. కరెంట్ సరఫరా లేకుండా కట్ చేయడంతో ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో విద్యుత్ సరఫరా లేక అంధకారంలోకి వెళ్ళింది. రోగులకు సేవలు నిలచి పోయాయి. ఈ విషయమై ట్రాన్స్ కో ఏఈ రమేష్ ను వివరణ కోరగా. కరోన సమయం నుంచి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ మేనేజ్ మెంట్ కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో రూ.90 లక్షలకు పైగా గవర్నమెంట్ కు బకాయి పడినట్లు చెప్పారు. బిల్లులు చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయడం జరిగిందని ఏఈ రమేష్ తెలిపారు.





