గోకవరం. జనసముద్రంన్యూస్ జూన్ 18
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రజలకు ఓ నమ్మకం -చంద్రబాబు అంటే మోసం అని ప్రజలు విశ్వసిస్తున్నారని గోకవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాటి రాంబాబు అన్నారు. మంగళవారం గోకవరంలో మాజీ సొసైటీ అధ్యక్షులు దాసరి చినబాబు స్వగృహం వద్ద మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం ఆదేశాలతో వైసీపీ మండల అధ్యక్షులు పాటి రాంబాబు అధ్యక్షతన జగన్ అంటే నమ్మకం- బాబు అంటే మోసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసిపి నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలునుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసి సుభిక్షమైన పాలన అందించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన అభివృద్ధి విజయాలను ఓ పుస్తకంగా పొందపరిచి ఆవిష్కరించారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష సభ్యులపై కక్ష సాధింపులుపై ఉన్న దృష్టి ప్రభుత్వానికి అభివృద్ధిపై లేదని పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైసీపీ నాయకులపై కక్ష సాధింపులు. కేసులు బనాయింపులు చేయడం సరికాదన్నారు. నేటికి ప్రజల్లో జగన్ కున్న ఆదరణ కూటమి ప్రభుత్వం ఓర్వలేక పోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కృషి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాసరి చినబాబు, ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, లీగల్ అడ్వైజర్ గుల్లా ఏడుకొండలు, సుంకర రమణ, సమ్మెట మోహన్, బ్యూల అబ్బులు,మడికి మైనర్ బాబు, గోకడ చిట్టిబాబు, అంబటి అబ్రహం, పి.సత్యానందం,తుర్రం సత్యవతి, కె సుమంగళి,ఎస్. మురళి జి.రామకృష్ణ ,సత్తిబాబు, అర్జున్, అధికారి బుజ్జి,బి. చిన్న అచ్చిరాజు, తి
ఇనకోటి సూర్యారావు,చిట్టిబాబు, అధిక సంఖ్యలో కార్యకర్తలు





