-రైతులు,సిబ్బంది ఇబ్బందులు.
జనసముద్రం న్యూస్ హుజురాబాద్ జూన్ 18
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం శిథిలావస్థలో చేరింది. పైకప్పు నుండి పెచ్చులు ఊడి పడటం, వర్షాలు పడితే లోపలికి నీరు రావడం వంటి సమస్యలతో అక్కడ పనిచేసే సిబ్బందితో పాటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- వర్షకాలంలో కార్యాలయంలో కంప్యూటర్లు తడిచే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక విద్యానగర్ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనుల కారణంగా కార్యాలయం రోడ్డుకంటే తక్కువగా ఉండిపోయింది. దీంతో వర్షం పడినప్పుడు కార్యాలయం చుట్టూ నీరు నిలిచి, లోపలికి వెళ్లాలంటే కష్టంగా మారుతోంది.
- ఈ కార్యాలయంలో హుజురాబాద్ డివిజన్‌కు చెందిన జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, సైదాపూర్ మండలాల రైతులు వ్యవసాయ పనుల కోసం ప్రతిరోజూ వస్తుంటారు. కానీ కార్యాలయం చుట్టూ ముళ్ళపదలు, పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో విషపూరిత పురుగులు సంచరిస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
- అంతేకాదు, కార్యాలయంలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కూడా లేవు. దీనివల్ల సిబ్బంది రోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి కొత్త భవనం నిర్మించాలని రైతులు, సిబ్బంది కోరుతున్నారు.





