మహాబూబబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జూన్ 16
మహాబూబబాద్ జిల్లా లో
చిన్న ముప్పారం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జంజిరాల నాగరాజు కోవిడ్ పీరియడ్ నుండి విత్తన బంతులను తయారుచేసి ఇనుగుర్తి రిజర్వ్ ఫారెస్ట్ లో వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జంజిరాల నాగరాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడంలో తన వంతు పాత్రగా ప్రతి సంవత్సరం విత్తనబంతులను తయారుచేసి ఇనుగుర్తి రిజర్వ్ ఫారెస్ట్ లో వేయడం జరిగింది. ఈ సంవత్సరం రావి, మర్రి,వేప, చింత, జామ, వెలగ, సీతాఫలం, ఖర్జూర బాదం, రేగు మొదలగు విత్తన బంతులను సుమారుగా 30 వేల విత్తన బంతులను తయారుచేసి వేయడం జరిగింది. పర్యావరణ పరి రక్షణలో అందరూ కూడా భాగస్వాములు భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న ముప్పారం ఉన్నత పాఠశాల విద్యార్థులు బానోతు రాజు, విగ్నేష్, సాయి,మహేష్, సంజయ్, అనిల్,సునీల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆదినారాయణ మరియు గ్రామస్తులు కామినేని హరికృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. విత్తన బంతుల తయారీలో పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు మరియు కామినేని హరికృష్ణ కి కృతజ్ఞతలు తెలియజేశారు.





