మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.16)
జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపల్ పట్టణం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్డు పనులు పరిశీలించిన ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్.ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఘట్కేసర్ మున్సిపల్ కి 30 కోట్ల నిధులు మంజూరు అవ్వడం సంతోషంగా ఉందన్నారు.పట్టణం పరిధిలో 100 ఫీట్ రోడ్డు అదేవిధంగా సెంటర్ లైటింగ్ తో అతి త్వరలో ప్రారంభం అవుతుంది అని,తెలుపుతూ రానున్న రోజుల్లో ఘట్కేసర్ అభివృద్ధిలో ముందుకు వెళ్లేందుకు మా వంతు కృషి ఎల్లప్పుడు ఉంటుంది అని,అంతే కాకుండా మీ ప్రజల అందరి సహకారం కావాలని కోరుతూ,జెర్మనీ టెక్నాలజీతో రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయని,అతి త్వరలో రోడ్డు మధ్యలో డివైడర్ సైతం ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులతో ఘట్కేసర్ మున్సిపల్ పట్టణం ముస్తాబు అవుతుంది అని కమర్షియల్ లో వ్యాపారం చేసుకునే వారికీ మంచిగా వ్యాపారం ఉంటుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్,డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు,మొయినార్టీ అధ్యక్షుడు ఫరూక్,అభిలాష్ యాదవ్,హెచ్ ఆర్ డి సి ఇంజనీర్ డిపార్ట్మెంట్ వారు,తదితరులు పాల్గొన్నారు.





