జనసముద్రం న్యూస్ – క్రైమ్ రిపోర్టర్, హత్నూర మండలం, సంగారెడ్డి జిల్లా
తేదీ: జూన్ 16
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మార్కాపూర్ గ్రామంలో పరిశ్రమల నుండి బయటికి వదిలే పొల్యూషన్ వాటర్ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్తులు వెల్లడించిందట్టి , పరిశ్రమల వలన గాలి, నీటి కాలుష్యం పెరిగి, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.
“ఇప్పటికే కరోనా వంటి వ్యాధులు గ్రామంలో ప్రబలే పరిస్థితి కనిపిస్తోంది,” అని ఒక గ్రామస్థుడు ఆవేదన వ్యక్తం చేశాడు. “పొల్యూషన్ ఆఫీసులకు, సంబంధిత అధికారులకు అనేకసార్లు ఫోన్ చేసినా, ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన లేదు,” అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కంపెనీ ప్రతినిధులు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా తమ వ్యాపార ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
“ఈసారి అయినా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి” అని గ్రామస్తులు గళమెత్తుతున్నారు.





