—వేదాంతం ఉపేందర్ (రిటైర్డ్ ఇంజనీర్ మరియు సామాజిక,ఆర్థిక రాజకీయ విశ్లేషకులు)
“మీరు జీవించి ఉన్నప్పుడు మీ బానిస సంకెళ్లు విరగ్గొట్టకపోతే దయ్యాలు ఆ పని చేస్తాయని మీరు అనుకుంటున్నారా?”
—సంత్ కబీర్ దాస్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.16)
జనసముద్రం న్యూస్ ఘట్కేసర్
ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 218వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది.ఈ రోజు ముఖ్యఅతిథిగా వేదాంతం ఉపేందర్ (రిటైర్డ్ ఇంజనీర్ మరియు సామాజిక,ఆర్థిక రాజకీయ విశ్లేషకులు) విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.వేదాంతం ఉపేందర్ మాట్లాడుతూ భారత్ దేశంలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యంగం రాయకుంటే భారత దేశం చాతుర్వర్ణ వ్యవస్థతో,మతోన్మాధంతో,కుల వ్యవస్థతో ఇంకో 5000 సంవత్సరాలు వెనక్కు పోయేది.నేను దళిత బహుజన సాహిత్యం పైనా అధ్యయనం చేస్తున్నాను.అంబేద్కర్ రిజర్వేషన్లు వల్ల ఎస్సీ,ఎస్టీ లు 3% మాత్రమే లబ్ది చెందారు.ఇంకా 97% అలాగే ఉన్నారు.తెలుగు సాహిత్యంలో గుర్రం జాషువా రాసిన గబ్బిలం నాకు ఆదర్శం,ఆయన రాసిన రచనలు కొన్ని గుర్తుచేసారు.నేను హిందువుగా పుట్టను కానీ,నేను హిందువుగా చావను అని అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తుచేసారు.అంబేద్కర్ స్వీకరించిన బౌద్ధంతోనే భరతదేశం గొప్ప దేశంగా వికసిస్తోంది.ప్రబుద్ధ భారత నిర్మాణం అవుతుంది అని తెలియజేసారు.2025లో తలసరి జిడిపి (నామమాత్రపు) పరంగా భారతదేశం 194 ఆర్థిక వ్యవస్థలలో 143వ స్థానంలో ఉంది.నామమాత్రపు జిడిపి పరంగా భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ,దాని పెద్ద జనాభా కారణంగా దాని తలసరి ఆదాయం సాపేక్షంగా తక్కువగా ఉంది.ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ (ఏప్రిల్ 2025) ప్రకారం భారతదేశంలో తలసరి ఆదాయం సుమారు $2,937.డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ స్ఫూర్తిని ఈ విధంగానే ప్రజలలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ,ఈ కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒకరికి జై భీంలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మేకల దాసు(అధ్యక్షుడు,అంబేద్కర్ యువజన సంఘం),కట్కూరి నర్సింగ్ రావు (అధ్యక్షుడు,గంగపుత్ర సంఘం,ఘట్కేసర్ మునిసిపాలిటీ),బండారి రాందాస్ (అధ్యక్షుడు,అంబేద్కర్ యువజన సంఘం,ఇ డబ్లూ ఎస్ కాలనీ),సిహెచ్ విజయ్ కుమార్,వై.వెంకటేశ్వర్ రావు,ఈ జగదీష్,టి.శ్రీరామ్,ఎస్.కృష్ణం రాజు,గంగారాం అంజయ్య,బి.గణేష్ గౌడ్,టి.మహేష్,తోక మల్లేష్,టి.శ్రీరామ్,ఈ.విష్ణ,లలిత్ మరియు తదితరులు పాల్గొన్నారు.





