విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ కాళహస్తి
చొప్పదండి(జనసముద్రం న్యూస్):
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాల, రుక్మాపూర్, మండలం చొప్పదండి, జిల్లా కరీంనగర్ విద్యార్ధి అజయ్, తొమ్మిదవ తరగతి, ఇటీవల ఫైన్ ఆర్ట్స్ స్కూల్, ఘట్కేసర్, హైదరాబాద్ లో జరిగిన వేదిక్ మాథ్స్ అండ్ కార్టూన్ మేకింగ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ ట్రోఫీ గెలుచుకున్నాడు. ఇంకో విద్యార్థి నరేష్, ఇంటర్ ద్వితీయ జూనియర్స్ స్టేట్ లెవెల్ బాక్సింగ్ టోర్నమెంట్ ఇటీవల నిజామాబాద్ లో జరిగింది. దీనిలో ఇతను బెస్ట్ అప్ కమింగ్ బాక్సర్ ట్రోఫీ అందుకున్నాడు. మరో విద్యార్ధి దుర్గారాజ్, తొమ్మిదవ తరగతి, తెలంగాణ రాష్ట్ర జూనియర్ హాకీ టోర్నమెంట్ అదిలాబాద్ లో ఈ నెల 10నుండి 12వరకు జరిగిన పోటీలలో రాణించినందుకు ప్రత్యేక బహుమతి అందుకొన్నాడు. ట్రోఫీలు గెల్చుకొన్న విద్యార్థులను మరియు ఫిజికల్ డైరెక్టర్ ఇనాక్ బాల సుందరం, ప్రిన్సిపాల్ జి. కాళహస్తి అభినందించారు.





