మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.15)
జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపాలిటీలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ కాలనీలోనీ తెలుగు మీడియం పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ లు పంపిణీ చేసిన ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి.ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కేసీఆర్ మంచి ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.తల్లిదండ్రులు మా పిల్లలను ప్రవేట్ స్కూల్లోకి పోకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి తమ పిల్లల భవిష్యత్తుకు ఉజ్వల భవిష్యత్తుకు బాట వేయాలని,ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసించడం వలన నాణ్యమైన విద్యను అనుభవిజ్ఞాన టీచర్లతో బోధించబడుతుంది అని,ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని,విద్యార్థులు ప్రతిరంగంలో ముందు ఉన్నారని ఆయన అన్నారు.జయశంకర్ బడి బాటలో భాగంగా ఉపాధ్యాయులు ఎవరైతే విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారొ వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ చదవడం వల్ల కలిగే లాభాల గురించి వివరించి,ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్నా వసతులను వివరించి వారి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన అన్నారు.అదేవిధంగా పిల్లలకి మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండేటట్టు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు చూడాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యురాలు దేవరకొండ పద్మ రాజాచారి,స్థానిక నాయకులు ఎండి నజీర్,మడి పడగే లక్ష్మయ్య,ఇక్బాల్,బర్ల లక్ష్మయ్య ముదిరాజ్,ప్రధానోపాధ్యాయులు రాజి రెడ్డి,ఉపాధ్యాయులు హైమావతి,విజయలక్ష్మి,సరిత,ఆయా విజయ,విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.





