కుషాయిగూడలో కార్పొరేటర్ సుడిగాలి పర్యటన
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.08)
జనసముద్రం న్యూస్ చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ వి.ఎన్ రెడ్డి నగర్ లో అధికారులతో కలిసి శనివారం పర్యటించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు,కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్.ఈ సందర్బంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు చర్లపల్లి డివిజన్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేపిస్తున్న కార్పొరేటర్ కి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే బొంతు శ్రీదేవి యాదవ్ ని వి.ఎన్.రెడ్డి నగర్ అసోసియేషన్ కార్యాలయంలో సభ్యులు సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏ ఈ స్వరూప,కాలనీ అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి,ఉప అధ్యక్షులు రంగ రెడ్డి,వీరయ్య,రామచంద్రయ్య,రాజశేఖరరెడ్డి,రాజేందర్ రెడ్డి,బాలరాజు, నగేష్,హనుమంత రెడ్డి,అంజి రెడ్డి,లక్ష్మా చారి, సాయి కృష్ణ,కుమార స్వామి,వెంకట సాయి,లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.





