జనసముద్రం న్యూస్ జైపూర్ జూన్ 7:
జైపూర్ మండలం లోని ముదికుంట గ్రామ శివారు లో అటవీ అభివృద్ధి సంస్థ కు చెందిన నీలగిరి ప్లాంటేషన్ లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు శుక్రవారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ ప్లాంటేషన్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కందకాలు తవ్వుతున్న కూలీలకు ఈ మజ్జిగ బాక్స్ లను అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి అందజేశారు. అనంతరం ఈ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, వాచర్ శంకర్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు





