ఎమ్మెల్యే కోరం కనకయ్య,
రాంరెడ్డి గోపాల్ రెడ్డి, *మల్లి బాబు యాదవ్
కామేపల్లి జనసముద్రం జూన్ 7:
కామేపల్లి మండలం రైతు వేదిక కేంద్రంలో కామేపల్లి తహసిల్దార్ సుధాకర్ అధ్యక్షతన భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం2025 రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, పుచ్చకాయల వీరభద్రం ధనియాకుల హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రైతులకు భూమి విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా రైతులకు భూమిపై వారికి పూర్తి హక్కులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూమి సమస్యల సత్వర న్యాయం శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకొని కొత్తగా ఈ భూభారతి పోర్టల్ ను తీసుకొచ్చిందని, గతంలో భూమి సమస్యలు ఉంటే పరిష్కారం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందని, కానీ ఇప్పుడు 60 రోజుల్లోనే, పరిష్కారం అవుతుందని, తాసిల్దార్లు జారీ చేసే పాస్ పుస్తకాలలో, భూధార్ పై అభ్యంతరాలు ఉంటే, ఆర్డీవో దగ్గర, ఆర్డీవో జారీచేసే సాదా బైనామాల క్రమబద్ధీకరణ విషయంలో అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రాంరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ధరణి చట్టంలో సాదా బైనమాల క్రమబద్ధీకరణకు ఎలాంటి నిబంధనలు లేకపోవడం వలన హైకోర్టు స్టే విధించింది. దానివలన రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఈ భూభారతి చట్టం వలన సత్వరమే న్యాయం పరిష్కారం జరుగుతుందని తెలిపారు. మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ రికార్డుల గురించి ధరణి చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఆ లోపాన్ని సవరించి కొత్త భూభారతి చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డుల పేరుతో నిబంధనలు విధించి గ్రామ పహాణి,ప్రభుత్వ భూములు నీటి వనరులను, భూమి రికార్డులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని, పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని, ప్రతి ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డులను ముద్రించి, విడిగా భద్రపరుస్తూ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గింజల నర్సిరెడ్డి, గుజ్జర్లపూడి రాంబాబు నల్లమోతు లక్ష్మయ్య, కామేపల్లి ఎండిఓ,రవీందర్ రామదాసు అర్జున్, శీలం పుల్లయ్య జక్కంపూడి వెంకటేశ్వర్లు, బాలు చింటూ, దొడ్డిగర్ల సుందరం, గోపిరెడ్డి ఎడ్లపల్లి బాబు, బావ్ సింగ్ సుమన్, అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు





